50 శాతం రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సిద్దమవుతున్న నేపథ్యంలో మంగళవారం రాత్రి 11.45 నుంచి 11.55 గంటల మధ్య పది నిమిషాల వ్యవధిలో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ పది రహస్య జీవోలు జారీ చేసింది. రిజర్వేషన్లు 59.58 నుంచి 50 శాతానికి కుదిస్తూ ఎన్నికలకు వెళ్లేందుకు ప్రభుత్వం ఆర్డినెన్స్, జీవోల్లో ఏదో ఒకటి తెచ్చే అవకాశాలున్నాయని ప్రచార నేపథ్యంలో జీవోలకు ప్రాధాన్యం ఏర్పడింది. న్యాయపరమైన ఇబ్బందులు ఎదురవ్వకుండా ముందు జాగ్రత్త చర్యగా రహస్య జీవోలు విడుదల చేశారా? ఇతర కారణాలేమైన ఉన్నాయా? అనేది తెలియాలి. నేడు మంత్రివర్గ సమావేశంలో రిజర్వేషన్లపై చర్చించి ఆమోదించే అవకాశాలున్నందున యాభై శాతానికి రిజర్వేషన్ల కుదించే జీవోలై ఉంటాయని అధికార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
అర్ధరాత్రి పది నిమిషాల వ్యవధిలో 10 రహస్య జీవోలు జారీ - ten confidential G.o's at ten minutes
హైకోర్టు ఆదేశాల మేరకు స్థానిక ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమవుతున్న తరుణంలో మంగళవారం అర్ధరాత్రి పది నిమిషాల వ్యవధిలో పది రహస్య జీవోలు విడుదల కావటం చర్చకు దారితీసింది. రిజర్వేషన్లను కుదిస్తూ ఎన్నికలకు వెళ్లేందుకు ప్రభుత్వం ఆర్డినెన్స్, జీవోల్లో ఏదో ఒకటి తెచ్చే అవకాశాలున్నాయని ప్రచార నేపథ్యంలో ఈ జీవోలకు ప్రాధాన్యం ఏర్పడింది.
పది నిమిషాల్లో 10 రహస్య జీవోలు