ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తెలంగాణలో ఆలయాల మూసివేత - Lunar Eclipse timing

Temples Closed in Telangana due to Lunar Eclipse : చంద్రగ్రహణం సందర్భంగా నేడు తెలంగాణలోని ఆలయాలను మూసివేయనున్నారు. యాదాద్రి ఆలయానికి ఉదయం కైంకర్యాల అనంతరం తాళం వేయనున్నారు. తిరిగి రేపు ఉదయం నుంచి భక్తులను దర్శనాలకు అనుమతించనున్నారు. గ్రహణం సందర్భంగా అన్ని సేవలను రద్దు చేశారు.

తెలంగాణలో ఆలయాల మూసివేత
తెలంగాణలో ఆలయాల మూసివేత

By

Published : Nov 8, 2022, 10:30 AM IST

Temples Closed in Telangana due to Lunar Eclipse: చంద్రగ్రహణం సందర్భంగా నేడు యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ ఆలయాన్ని మూసివేస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు నల్లందిగల్​ లక్ష్మీనరసింహ చార్యులు తెలిపారు. ఉదయం మూడు గంటలకు ఆలయాన్ని తెరిచి నిత్య కైంకర్యాలు నిర్వహించారు. ఈ కైంకర్యాల అనంతరం ఉదయం 8.15 గంటలకు ఆలయాన్ని మూసివేస్తామని తెలిపారు. చంద్రగ్రహణం ముగిసిన తరవాత తిరిగి రాత్రి 8 గంటలకు ఆలయాన్ని తెరిచి సంప్రోక్షణ పూజలు నిర్వహించి, రాత్రి 10 గంటలకు ఆలయాన్ని మూసివేస్తామని పేర్కొన్నారు.

మరుసటి రోజు ఉదయం యధావిధిగా ఆలయాన్ని తెరవడం జరుగుతుందని తెలిపారు. గ్రహణం సందర్భంగా ఆలయాన్ని మూసివేయడంతో స్వామి వారి దర్శనాలు, సత్యనారాయణ వ్రతాలు, వాహన పూజలు, నిత్య కైంకర్యాలు, స్వామి వారి కల్యాణం, బ్రహ్మోత్సవం, ఊరేగింపు సేవలు రద్దు చేసినట్లు వివరించారు. ఈ విషయాన్ని భక్తులు అందరూ గ్రహించాలని కోరారు. యాదాద్రితో పాటు రాష్ట్రంలోని అన్ని ఆలయాలను నేడు మూసివేయనున్నారు. తిరిగి రేపు ఉదయం నుంచే భక్తులను దర్శనాలకు అనుమతించనున్నారు.

ఇవీ చూడండి..

ABOUT THE AUTHOR

...view details