కరోనా కారణంగా రాష్ట్రవ్యాప్తంగా మూతపడిన ఆలయాల తలుపులు ఇవాళ తెరుచుకుంటున్నాయి. వైరస్ వ్యాప్తిని నియంత్రించేలా ఆయా ఆలయాల అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బెజవాడ దుర్గ గుడిలో సోమవారం,మంగళవారం ఆలయ సిబ్బంది, స్థానికులతో ట్రయల్ రన్ నిర్వహించి బుధవారం నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తామని ఆలయపాలక మండలి ఛైర్మన్ పైలా సోమినాయుడు వెల్లడించారు. నిత్యం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దర్శనం ఉంటుందని స్పష్టం చేశారు.
ఆలయాలకు వచ్చే భక్తులు అన్నిరకాల జాగ్రత్తలు తీసుకోవాలని తూర్పుగోదావరి జిల్లా అధికారులు సూచించారు. మాస్క్ ధరించిన వారిని మాత్రమే దర్శనానికి అనుమతించాలని సిబ్బందిని ఆదేశించారు. అన్నవరం ఆలయంలో దర్శనాలు ప్రయోగాత్మకంగా ప్రారంభిస్తున్నా కొండపై దుకాణాలు తెరిచేందుకు వ్యాపారాలు నిరాసక్తత కనబరుస్తున్నారు. కరోనా వ్యాప్తి, నిబంధనలతో భక్తుల రాక తగ్గే పరిస్థితుల్లో వ్యాపారులు చేయలేమని తెలిపారు. అయినవిల్లి సిద్ధి వినాయకుడి ఆలయం రెడ్ జోన్లో ఉండడం వల్ల గణేశుడి భక్తులకు నిరీక్షణ తప్పేలా లేదు.
300 మంది మాత్రమే..!