వేసవి సీజన్ ఆరంభంలోనే ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఉష్ణోగ్రతలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలను మించినట్టు వాతావరణశాఖ వెల్లడించింది. సగటు ఉష్ణోగ్రతలు రెండు నుంచి మూడు డిగ్రీల మేర పెరిగినట్టు ఐఎండీ స్పష్టం చేసింది.
నెల్లూరు నుంచి విశాఖ వరకు..
నెల్లూరు జిల్లా మనుబోలులో అత్యధికంగా 41.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత రికార్డు అయ్యింది. చిత్తూరు జిల్లాలో 41.3, నెల్లూరు ఉదయగిరిలో 41.1 పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు 41, ప్రకాశం జిల్లాలో 40.9, కర్నూలులో 40.9, తూర్పుగోదావరి జిల్లాలో 40.8, గుంటూరులో 40.7 డిగ్రీలు, పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడిలో 41.4, కడపలో 40.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. ఇక విజయవాడలోని అమరావతిలో 41.68 డిగ్రీలు, శ్రీకాకుళంలో 41.63 డిగ్రీలు, విజయనగరం తెర్లాంలో 41.5 డిగ్రీలు, అనంతపురం తాడిపత్రిలో 41.1, చిత్తూరు రేణిగుంటలో 41.1 డిగ్రీలు, విశాఖ జిల్లా రావికమతంలో 41.08 డిగ్రీలు నమోదయ్యాయి.