ప్రభుత్వాలు మారినప్పుడల్లా పెట్టుబడిదారులపై ఒత్తిడి పెరిగితే, ఏవిధమైన సంస్థలు పెట్టుబడులకు ముందుకు రావని అంతర్జాతీయ సంస్థలు చెప్పాయంటూ తెదేపా అధికార ప్రతినిధి పట్టాభి విజయవాడలో వ్యాఖ్యానించారు. 'విద్యార్థులకు అన్యాయం చేస్తున్న జగన్.. పరిశ్రమలు రాకుండా చేస్తూ యువతను నిలువునా ముంచేస్తున్నారు' అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి వచ్చే పెట్టుబడిదారులు రక్షణ కల్పించాలని కోరడం సిగ్గుచేటని మండిపడ్డారు.
'రాష్ట్ర బ్రాండ్‌ను ప్రభుత్వం దెబ్బ తీస్తోంది' - ఏషియన్ నెట్ వర్క్కులో సీఎం జగన్ ఇంటర్వ్యూ తాజా వార్తలు
కిల్ ఏపీ అన్న నినాదాన్ని సీఎం జగన్ బాగా ముందుకు తీసుకెళుతున్నారని తెదేపా అధికార ప్రతినిధి పట్టాభి ఎద్దేవా చేశారు. రాష్ట్రానికున్న బ్రాండ్ ఇమేజ్ తోపాటు, దేశ ఇమేజ్ను కూడా దెబ్బతీస్తున్నాడని ధ్వజమెత్తారు.
విజయవాడలో తెదేపా అధికార ప్రతినిధి పట్టాభి వ్యాఖ్యలు