కృష్ణా జిల్లా జగ్గయ్యపేట ప్రజలకు కృష్ణా జలాలు అందించాలని జగ్గయ్యపేట తెలుగు యువత డిమాండ్ చేసింది. గత ప్రభుత్వ హయాంలో పనులు పూర్తి చేసుకుని ప్రారంభానికి సిద్దంగా ఉన్న ప్రాజెక్టు నుంచి తాగునీటిని విడుదల చేయాలన్నారు. ఈ మేరకు యువత ఆధ్వర్యంలో.. ముత్యాల నుంచి జగ్గయ్యపేట వరకు పాదయాత్ర చేశారు.
వెంటనే తాగునీటిని విడుదల చేయాలి: తెలుగు యువత - ముత్యాల నుంచి జగ్గయ్యపేటకు తెలుగు యువత పాదయాత్ర
నిర్మాణం పూర్తి చేసుకుని ప్రారంభానికి సిద్ధంగా ఉన్న తాగునీటి పథకాన్ని వెంటనే ప్రారంభించి నీటిని విడుదల చేయాలని జగ్గయ్యపేట తెలుగు యువత డిమాండ్ చేసింది. తెలుగు యవత ఆధ్వర్యంలో... ముత్యాల నుంచి జగ్గయ్యపేటకు పాదయాత్ర చేపట్టారు.
వెంటనే తాగునీటిని విడుదల చేయాలి: తెలుగు యువత
పాదయాత్ర ముగింపు అనంతరం స్థానిక మున్సిపల్ కూడలిలో సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి నెట్టెం రఘురాం, మాజీ ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముత్యాల పథకంతో పాటు గత ప్రభుత్వం తలపెట్టిన పలు అభివృద్ధి పనులను వివరించారు.
ఇది చూడండి:కృష్ణా నదికి పెరుగుతున్న ప్రవాహ ఉద్ధృతి
TAGGED:
తెలుగు యవత పాదయాత్ర