ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'భూత్యాగం చేసిన రైతులతో వైకాపా చెలగాటం' - Telugudesam office news in Vijayawada

విజయవాడ పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్​ భవన్​లో తెలుగు దేశం అధినేతను తెలుగు మహిళలు కలిశారు. రాజధాని కోసం 100మందికిపైగా రైతులు ప్రాణాలు కోల్పోయినా ప్రభుత్వం మూర్ఖంగా వ్యవహరిస్తోందని వాపోయారు. రాజధాని పోరాట తీరును చంద్రబాబుకు వివరించారు.

ఎన్టీఆర్​ భవన్​లో తెలుగు దేశం అధినేతను కలిసిన తెలుగు మహిళలు

By

Published : Dec 2, 2020, 8:56 PM IST

వైకాపా మూర్ఖపు చర్యల వల్ల భావితరాలు మూల్యం చెల్లించాల్సి వస్తోందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్​లో తెలుగు మహిళలు చంద్రబాబుని కలిసి రాజధాని రైతుల పోరాట తీరును వివరించారు. భూత్యాగం చేసిన రైతులు, మహిళలు, రైతు కూలీల జీవితాలతో వైకాపా ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని ఆయన మండిపడ్డారు. పెట్టుబడులను వెళ్లగొట్టి, పరిశ్రమలను తరిమేసి 13జిల్లాల యువతకు తీరని అన్యాయం చేశారని విమర్శించారు. ప్రజలే వైకాపాకు తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. రాజధాని కోసం 100మందికి పైగా రైతులు ప్రాణాలు కోల్పోయినా ప్రభుత్వం మూర్ఖంగా వ్యవహరిస్తోందని మహిళలు చంద్రబాబు వద్ద వాపోయారు.

ABOUT THE AUTHOR

...view details