ఏడాదిగా ఏపీలో రాక్షసపాలన కొనసాగుతోందని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత విజయవాడలో విమర్శించారు. వైకాపా పాలనలో మహిళలకు రక్షణ లేదన్న ఆమె..., మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నా ముఖ్యమంత్రి స్పందించడంలేదని మండిపడ్డారు. నెల్లూరు జిల్లాలో టూరిజం ఉద్యోగినిపై దాడి బాధాకరమని, సోషల్ మీడియాలో వీడియో వచ్చేదాకా ఏపీ మహిళా కమిషన్ స్పందించలేదని విమర్శించారు. రాష్ట్రంలో హోంమంత్రి, మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ ఉన్నారా? అని ప్రశ్నించారు. మహిళల భద్రతే తెదేపాకి ముఖ్యమని స్పష్టం చేసిన ఆమె.. దిశకు ప్రభుత్వం దిశా నిర్దేశం చేయాలని డిమాండ్ చేశారు.
'వైకాపా పాలనలో మహిళలకు రక్షణ లేదు'
టూరిజం ఉద్యోగినిపై దాడి చేసిన భాస్కర్‌పై నిర్భయ చట్టం కింద కేసు ఎందుకు పెట్టలేదని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ప్రశ్నించారు. ప్రశ్నించిన వారిని జగన్ ప్రభుత్వం వేధిస్తోందని ఆమె ఆరోపించారు. పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా మారారన్నారు. అనితారాణిపై వైకాపా కార్యకర్తలు అసభ్యంగా ప్రవర్తించినా, మహిళా వాలంటీర్లపై దాడులకు పాల్పడిన చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు.
వైకాపా ప్రభుత్వం తీరుపై మండిపడ్డ తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత
TAGGED:
వంగలపూడి అనిత తాజా వ్యాఖ్యలు