దర్శకుడి దార్శనికతను చూడగలిగే సృజన రచయితకు ఉండాలని సినీ, నాటకరంగ రచయిత, నటులు కృష్ణేశ్వరరావు అన్నారు. విజయవాడలోని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో తెలుగు లఘు చిత్రాలపై నిర్వహిస్తున్న కార్యశాలకు ఆయన హాజరయ్యారు. సామాజిక స్పృహతోపాటు, వర్తమాన అంశాలపై పట్టు ఉన్నప్పుడే రచయితలుగా రాణించగలరని తెలిపారు. రచయితలకు పుస్తక పఠనంతోపాటు.. అధ్యయనం చాలా అవసరమని స్పష్టం చేశారు. ఔత్సాహికులకు కథా రచనలో మెళకువలు నేర్పించారు. ఇవాల్టి నుంచి మూడు రోజులపాటు జరగనున్న ఈ కార్యక్రమంలో దర్శకత్వం, ఛాయాగ్రహణంపై మెళకువలు ఇవ్వనున్నారు. లఘుచిత్ర దర్శకులు, నటీనటులు, ఛాయాగ్రహకులు హాజరయ్యారు.
ఇవీ చదవండి..