ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కూరగాయలు పంచిన నటుడు నాని - corona cases in ap

కృష్ణా జిల్లా వెలది గ్రామంలో పేదలకు.. సినీ నటుడు నాని దంపతులు కూరగాయలు పంపిణీ చేశారు.

Telugu hero nani distributes vegitables to krishna dst veladhi villagers due to lockdown
కూరగాయలు పంపిణీ చేసిన సినీనటుడు నాని

By

Published : Apr 26, 2020, 6:23 PM IST

ప్రముఖ సినీ నటుడు నాని, ఆయన సతీమణి అంజన సహకారంతో... కృష్ణా జిల్లాలోని పున్నవల్లి వెలది గ్రామాల్లో పేదలకు కూరగాయలు పంపిణీ చేశారు. లాక్ డౌన్ విధించిన కారణంగా ఆయా గ్రామాల్లో ఇబ్బందులు పడుతున్న పేదలకు ఆసరా ఫౌండేషన్‌ సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ప్రతి ఇంటికీ కూరగాయలు అందించిన హీరో నాని కుటుంబానికి గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. గతంలో పున్నవల్లి గ్రామంలో ఆసరా ఫౌండేషన్ నిర్మించిన గ్రంథాలయ ప్రారంభోత్సవానికి నాని సతీమణి అంజన వచ్చారని గుర్తు చేసుకున్నారు. తాజా చర్యతో.. ఈ గ్రామం పట్ల అనుబంధాన్ని పెంచుకున్నారని ఆనందించారు.

ABOUT THE AUTHOR

...view details