ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైకాపా వైఫల్యాలే ప్రచార అస్త్రాలుగా తెలుగుదేశం పయనం

రెండేళ్ల వైకాపా పాలనలో ప్రభుత్వ వైఫల్యాలే ప్రచారాస్త్రాలుగా తెదేపా కరపత్రాలను సిద్ధం చేసింది. తిరుపతి ఉప ఎన్నికల్లో భాగంగా ప్రతి ఇంటికీ వీటిని చేరవేసే ప్రణాళికతో ముందుకెళ్తోంది. కేసుల మాఫీ కోసం కేంద్రానికి 28 మంది ఎంపీలను ఇప్పటికే తాకట్టుపెట్టిన అధికార వైకాపాను ఓడించి ప్రశ్నించే గొంతుకను గెలిపించాలనే నినాదంతో రూపొందిన పాంప్లెట్లలను పార్టీ అధినేత చంద్రబాబు విడుదల చేశారు. త్వరలోనే చంద్రబాబు తిరుపతి ఉపఎన్నిక ప్రచారానికి వెళ్లనున్నారు. ఇప్పటికే తిరుపతి చేరుకున్న పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఎన్నికల ప్రచార పర్వం ముగిసేవరకూ అక్కడే మకాం వేయనున్నారు.

వైకాపా వైఫల్యాలే ప్రచార అస్త్రాలుగా తెలుగుదేశం పయనం
వైకాపా వైఫల్యాలే ప్రచార అస్త్రాలుగా తెలుగుదేశం పయనం

By

Published : Apr 4, 2021, 6:48 AM IST

వైఎస్​ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలే ప్రచార అస్త్రాలుగా తెలుగుదేశం కరపత్రాలను సిద్ధం చేసింది. తిరుపతి లోక్​సభకు జరగనున్న ఉప ఎన్నికల్లో భాగంగా ప్రతి ఇంటికీ.. వీటిని చేరవేసే ప్రణాళిక రచించింది. అక్రమాస్తులు సహా ఇతర కేసుల మాఫీల కోసం కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికే పార్లమెంట్ సభ్యులను తాకట్టుపెట్టిందని కరపత్రంలో పొందుపరిచారు. అధికార పార్టీని ఓడించి.. ప్రశ్నించే గొంతుకను గెలిపించాలనే నినాదంతో తయారు చేసిన ఈ కరపత్రాలను... ఆ పార్టీ అధినేత చంద్రబాబు విడుదల చేశారు.

పెరిగిన ధరలపై..

పెంచిన విద్యుత్ ఛార్జీలు, రేషన్ కార్డుల రద్దు, పెరిగిన నిత్యవసరాల ధరలతో ప్రజలపై భారం పడుతోందని, ప్రభుత్వ నిర్ణయాలవల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని కరపత్రాల్లో పేర్కొన్నారు.

గెలుపే లక్ష్యంగా..

తిరుపతి ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి పనబాక లక్ష్మి గెలుపే లక్ష్యంగా తెలుగు దేశం ప్రచారాన్ని వేగవంతం చేసింది. ఇప్పటికే తిరుపతి వెళ్లిన పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ ప్రచార కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. అధినేత చంద్రబాబు త్వరలోనే తిరుపతి వెళ్లనున్నారు.

ఇవీ చూడండి :

పరిషత్‌ ఎన్నికలపై నేడు హైకోర్టులో విచారణ

ABOUT THE AUTHOR

...view details