ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

NARA LOKESH: 'పింఛన్లు పెంచుతామని తగ్గిస్తున్నారు..!' - ap political news

పింఛన్లు పెంచుతానన్న ప్రభుత్వమే వాటిని తగ్గిస్తోందని తెలుగు దేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల హామీల్లో భాగంగా 3 వేల రూపాయల పింఛన్‌ ఇస్తానని చెప్పిన సీఎం జగన్... మాట తప్పారని ట్విట్టర్ వేదికగా తెలిపారు.

telugu-desam-party-general-seceratry-nara-lokesh-fires-on-ycp-govt-on-pensions
'పింఛన్లు పెంచుతామని తగ్గిస్తున్నారు..!'

By

Published : Sep 6, 2021, 11:40 AM IST

రాష్ట్రంలో పింఛన్​ డబ్బుల మీదే ఆధారపడి జీవిస్తున్న చాలామంది పింఛన్లను తొలగిస్తున్నారంటూ... తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ మండిపడ్డారు. పింఛన్లు పెంచుకుంటూ పోతానన్న ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి... ఇప్పుడు తుంచుకుంటూ పోతున్నారని ట్వీట్ చేశారు. ప్రమాణ స్వీకారం రోజు జగన్ చెప్పిన దాని ప్రకారం ప్రస్తుతం 2 వేల 750కి పింఛన్‌ పెంచాల్సి ఉండగా... ఇప్పటికీ 2వేల 250 రూపాయలే ఇస్తున్నారని అన్నారు.

3 వేల రూపాయల పింఛన్‌ ఇస్తానని ఎన్నికల ముందు చెప్పిన జగన్‌... అధికారంలోకి వచ్చాక మాట తప్పారన్నారు. 65 లక్షల మందికి పింఛన్‌ ఇస్తామని గొప్పగా ప్రకటించినప్పటికీ, గత 2 నెలల్లో 2.3 లక్షల పింఛన్లు తీసేశారని లోకేశ్ గుర్తుచేశారు. వివిధ రకాల పనుల కోసం ఇంకో ప్రాంతానికి వెళ్లిన వారి పింఛన్లు తీసేయడం అన్యాయమన్నారు.

ఇదీ చూడండి:CBN: మత్స్యకారులకు ఉరి బిగించేలా జీవోనెం.217: చంద్రబాబు

ABOUT THE AUTHOR

...view details