ప్రపంచ ప్రసిద్ధ భాషా శాస్త్రవేత్త రావుబహద్దూర్ గిడుగు వెంకట రామమూర్తి జయంతి సందర్భంగా తెలుగు భాష దినోత్సవం నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. విజయవాడలో 600 మంది ప్రభుత్వ పాఠశాల చిన్నారులు తెలుగు బాల శతకం పద్యారాధన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ఛాంపియన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు లభించింది. ఛాంపియన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు ప్రతినిధి పట్టాభి రామ్ వరల్డ్ రికార్డు నమోదు పత్రాన్ని ఎస్ఆర్ఆర్ & సీవీఆర్ కళాశాల ప్రిన్సిపాల్‌కు జ్ఞాపికను అందజేశారు. 55 నిమిషాలలో పూర్తి చేయాల్సి ఉండగా కేవలం 35 నిమిషాల్లోనే పూర్తిచేసి.. తెలుగు విద్యార్థుల సత్తా చాటారని ఛాంపియన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు ప్రతినిధి తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు చక్కటి ప్రతిభ కనబరుస్తారు... అనేదానికి ఈ రికార్డు నిదర్శనమని, తెలుగు భాష వ్యాప్తికి పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు.
ఘనంగా తెలుగు భాషా దినోత్సవం - srr& cvr college
విజయవాడ ఎస్ఆర్ఆర్&సీవీఆర్ కళాశాలలో తెలుగు భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
తెలుగు భాషా దినోత్సవం