ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విజయవాడలో.. 'తెలుగు కోసం పరుగు' - విజయవాడలో తెలుగు కోసం పరుగు తాజా వార్తలు

అవారా సంస్థ ఆధ్వర్యంలో ఐదు కిలోమీటర్ల పరుగును విజయవాడలో నిర్వహించారు.'తెలుగు కోసం పరుగు' పేరిట ఈ కార్యక్రమం ఏర్పాటుచేశారు. పరుగు అనంతరం కొండవీటి ఉద్యావనంలో తెలుగు భాష సమ్మేళనం జరిగింది. అమ్మ భాష ఆత్మీయ భాష అంటూ భాషాభిమానులు నినదించారు.

telugu-awareness-run-in-vijayawada

By

Published : Nov 18, 2019, 3:53 PM IST

'తెలుగు కోసం పరుగు'

'తెలుగు కోసం పరుగు' పేరిట విజయవాడలో అవారా సంస్థ ఆధ్వర్యంలో ఐదు కిలోమీటర్ల పరుగు నిర్వహించారు. మా తెలుగు తల్లికి మల్లెపూదండ అంటూ తెలుగు భాషారాధకులు, చిన్నారులు, పౌరులు తెలుగుతల్లికి ప్రణమిల్లారు. అమ్మ భాష ఆత్మీయ భాష అంటూ నినదించారు. కొండవీటి ఉద్యావనంలో తెలుగు భాష సమ్మేళనం నిర్వహించారు. యునెస్కో అంచనా ప్రకారం అంతరించిపోతున్న భాషల జాబితాలో తెలుగు ఉందని ఆందోళన చెందారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా తెలుగును బతికించేలా విస్తృత కార్యక్రమాలు చేపట్టాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details