ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రామాపురం క్రాస్ రోడ్ వద్ద ఏపీ నుంచి వెళ్లే వాహనాలు నిలిపివేత.. - తెలంగాణ లాక్​డౌన్ అప్​డేట్స్

తెలంగాణ సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామాపురం క్రాస్ రోడ్ తెలంగాణ చెక్ పోస్ట్ వద్ద ఏపీ నుంచి వచ్చే వాహనాలను పోలీసులు నిలిపివేస్తున్నారు. అత్యవసరంగా వెళ్లే వాహనాలను, ఈ-పాస్ ఉన్న వాహనాలను మాత్రమే అనుమతిస్తున్నారు.

telengana police stopping andhra vehicles
రామాపురం క్రాస్ రోడ్ వద్ద ఏపీ వాహనాలు నిలిపివేత..

By

Published : May 12, 2021, 1:24 PM IST

తెలంగాణ సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామాపురం క్రాస్ రోడ్ తెలంగాణ చెక్ పోస్ట్ వద్ద ఆంధ్ర నుంచి వచ్చే వాహనాలను పోలీసులు నిలిపి వేశారు. తెలంగాణలో లాక్ డౌన్ కారణంగా వాహనాలను ఆపుతున్నట్లు పోలీసులు తెలిపారు. రాష్ట్రం నుంచి వెళ్లే వాహనాలను తిరిగి వెనక్కు పంపిస్తున్నారు. అత్యవసరంగా వెళ్లే వాహనాలను, ఈ-పాస్ ఉన్న వాహనాలను అనుమతిస్తున్నారు.

ప్రస్తుతం రాష్ట్రం నుంచి తక్కువ సంఖ్యలో వాహనాలు తెలంగాణకు వెళ్తున్నాయి. తెలంగాణలో పది రోజులు లాక్ డౌన్ ఉన్నందున ప్రయాణికులు సహకరించాలని కోరుతున్నారు. లాక్ డౌన్ కారణంగా పోలీసు, రెవిన్యూ, ఆరోగ్య సిబ్బంది చెక్ పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తున్నారు.

రామాపురం క్రాస్ రోడ్ వద్ద ఏపీ నుంచి వెళ్లే వాహనాలు నిలిపివేత..

ఇదీ చదవండి:

నాలుగున్నర గంటల ఆలస్యం...గాల్లో కలిసిన 11 ప్రాణాలు !

ABOUT THE AUTHOR

...view details