తెలంగాణలోని ఖమ్మం జిల్లా మధిర మండలంలోని మద్యం దుకాణాల నుంచి రాష్ట్రంలోకి అక్రమంగా తరలిస్తున్న 318 మద్యం సీసాలను.. కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు పోలీసులు పట్టుకున్నారు. ఒక కారును స్వాధీనం చేసుకొని ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
మద్యాన్ని కారులో విజయవాడ తరలిస్తుండగా ముచ్చింతల గ్రామం వద్ద కారు ఆపి తనిఖీ చేయగా.. విషయం గుర్తించామని నందిగామ డీఎస్పీ రమణమూర్తి జగ్గయ్యపేట, సీఐ నాగేంద్ర కుమార్ ఎస్సై రామకృష్ణ తెలిపారు.