ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

లక్షల్లో టెలి కన్సల్టేషన్​ సేవలు.. అత్యధికం విశాఖ.. అత్యల్పం శ్రీకాకుళం - 104 services in andhra pradesh

కొవిడ్ వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 104 కాల్ సెంటర్​ లక్షల సంఖ్యలో ప్రజల నుంచి కాల్స్ అందుకుని టెలి మెడిసిన్ సేవలందించింది(telemedicine services in andhra pradesh news). కొవిడ్ బాధితులతో పాటు ఇతరులకు 11.91 లక్షల టెలికన్సల్టేషన్ సేవలు అందించినట్లు 104 తెలియజేసింది. మొత్తంగా 5546 మంది వైద్యులు టెలికన్సల్టేషన్ కోసం నియమించుకున్నట్టు వైద్యారోగ్యశాఖ తెలిపింది.

telemedicine services in andhrapradesh
telemedicine services in andhrapradesh

By

Published : Oct 19, 2021, 5:28 PM IST

కొవిడ్ సమయంలో టెలికన్సల్టేషన్(teleconsultation services in covid time news) సేవలందించేందుకు 11.91 లక్షల కాల్స్ చేసినట్టు 104 స్పష్టం చేసింది. వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా ఇంటి వద్ద నుంచే రోగుల నుంచి వ్యక్తమైన వివిధ సందేహాలకు వైద్యులు టెలిమెడిసిన్ ద్వారా సేవలందించారని వెల్లడించింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి కొవిడ్ రెండో విడతలో భాగంగా టెలికన్సల్టేషన్ సేవలను అందించినట్టు 104 తెలిపింది.

మొత్తంగా 5546 మంది వైద్యులు టెలికన్సల్టేషన్ సేవల(teleconsultation services in ap news)ను అందిచేందుకు నమోదు చేసుకున్నారని ఇందులో 1146 మంది స్పెషలిస్టు వైద్యులు కూడా ఉన్నట్టు వెల్లడించింది. నేరుగా రోగులతో మాట్లాడి వారికి అవసరమైన టెలి వైద్య సేవల్ని అందించారని, అలాగే సూచనలు చేసినట్టు పేర్కొంది. కొవిడ్​కు సంబధించి హోమ్ ఐసోలేషన్, క్వారంటైన్, ఫీవర్ సింప్టమాటిక్ సర్వే, పీడియాట్రిక్స్ తదితర సేవల్ని అందించినట్టు వివరించింది.

రాష్ట్రంలో అత్యధికంగా విశాఖ జిల్లా నుంచి టెలికన్సల్టేషన్ సేవలకు సంబంధించిన ఫోన్ కాల్స్ వచ్చాయని పేర్కొంది. మొత్తం 1 లక్షా 52 వేల కాల్స్​ను వివిధ రకాలైన ఆరోగ్య సమస్యలను వైద్యులకు నివేదించారని తెలిపింది. కృష్ణా జిల్లా నుంచి 1.24 లక్షల కాల్స్ వచ్చాయని వెల్లడించింది. అత్యల్పంగా శ్రీకాకుళం నుంచి 12,246 కాల్స్ మాత్రమే వచ్చాయని స్పష్టం చేసింది.

ఇదీ చదవండి:

Azadi Ka Amrit Mahotsav: బ్రిటిషర్లకు లొంగని బానిస రాణి.. హజ్రత్​ మహల్​!

ABOUT THE AUTHOR

...view details