ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Accident: రోడ్డు ప్రమాదంలో తేలప్రోలు ఎంపీపీ మృతి - రోడ్డు ప్రమాదంలో తేలప్రోలు ఎంపీపీ మృతి

Accident: కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గం ఉంగుటూరు మండలం తేలప్రోలు గ్రామానికి చెందిన ఎంపీపీ ప్రసన్నలక్ష్మి మృతి చెందింది. రాత్రి ఉంగుటూరులో భార్యాభర్తలు కలిసి ప్రైవేట్ కార్యక్రమానికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.

accident
రోడ్డు ప్రమాదంలో తేలప్రోలు ఎంపీపీ మృతి

By

Published : Apr 6, 2022, 12:28 PM IST

Accident: కృష్ణా జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉంగుటూరు మండలం తేలప్రోలు గ్రామానికి చెందిన ఎంపీపీ ప్రసన్నలక్ష్మి మృతిచెందిది. ఈ ఘటన ఉంగుటూరు మండలం తేలప్రోలు-ఆనందపురం కూడలిలో చోటు చేసుకుంది. మంగళవారం ఉదయం ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన బాబుజగ్జీవన్​రావు జయంతి వేడుకల్లో పాల్గొన్న ఆమె సాయంత్రం ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు భర్తతో కలిసి ద్విచక్ర వాహనంపై బయలుదేరి వెళ్తుండగా ప్రమాదానికి గురయ్యారు. తీవ్రగాయాలైన ఆమెను చికిత్స నిమిత్తం పిన్నమనేని సిద్దార్ధ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఉదయం మృతి చెందారు. పోస్టుమార్టం నిమిత్తం ఆమెను గన్నవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

రోడ్డు ప్రమాదంలో తేలప్రోలు ఎంపీపీ మృతి

గతేడాది జరిగిన మండల పరిషత్ ఎన్నికల్లో తేలప్రోలు ఎంపీటీసీ అభ్యర్థిగా ఏకగ్రీవంగా ఎన్నికయిన ప్రసన్నలక్ష్మి.. అనంతరం ఉంగుటూరు మండల ఎంపీపీగా బాధ్యతలు చేపట్టారు. విద్యవంతురాలు అయిన ప్రసన్నలక్ష్మి ఎంపీపీగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రసన్నలక్ష్మి మృతి పట్ల ఎమ్మెల్యే వంశీమోహన్, వైకాపా నేతలు, కుటుంబ సభ్యులు, తోటి ప్రజాప్రతినిధులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: CM Jagan: నేడు గవర్నర్‌ బిశ్వభూషణ్‌తో ముఖ్యమంత్రి జగన్‌ భేటీ

ABOUT THE AUTHOR

...view details