ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

pulichinthala project: ప్రభుత్వ విప్​ను అడ్డుకున్న తెలంగాణ పోలీసులు - పులిచింతల ప్రాజెక్టు వద్ద తెలంగాణ పోలీసులు

కృష్ణా జిల్లా జగ్గయ్యపేట నుంచి పులిచింతల ప్రాజెక్టు వద్దకు వెళుతున్న ప్రభుత్వ విప్​, జగ్గయ్యపేట ఎమ్మెల్యే ఉదయభానును తెలంగాణ పోలీసులు అడ్డుకున్నారు. తెలంగాణ పోలీసులతో ఉదయభాను చర్చించేందుకు ప్రయత్నించారు.

Telangana police prevented   government whip going to the Pulichintala project
పులిచింతల ప్రాజెక్టు పరిశీలనకు వెళ్తున్న జగ్గయ్యపేట ఎమ్మెల్యే అడ్డగింత

By

Published : Jul 11, 2021, 12:53 PM IST

Updated : Jul 11, 2021, 4:47 PM IST

పులిచింతల ప్రాజెక్టు పరిశీలనకు వెళ్తున్న జగ్గయ్యపేట ఎమ్మెల్యే అడ్డగింత

కృష్ణా జిల్లా జగ్గయ్యపేట నుంచి పులిచింతల ప్రాజెక్టు వద్దకు వెళ్తున్న ప్రభుత్వ విప్‌ సామినేని ఉదయభానుని సరిహద్దులో తెలంగాణ పోలీసులు అడ్డుకున్నారు. ముక్త్యాల గ్రామ శివారులోనే తెలంగాణ పోలీసులు ఆయనను ఆపివేశారు. ఏపీ భూభాగం నుంచి వెళ్లాలని సూచించారు. వాస్తవాలు పరిశీలించేందుకు వెళ్తుంటే అడ్డుకోవాల్సిన అవసరం ఏంటని అధికారులను ఉదయభాను నిలదీశారు. నీటి వాటాలపై తెలంగాణ ప్రభుత్వం నిబంధనలు పాటించట్లేదని విమర్శించారు.

కృష్ణా డెల్టా అవసరాల కోసమే పులిచింతల నిర్మించారని.. ఏపీ రైతుల హక్కులను కాలరాస్తూ తెలంగాణ విద్యుత్‌ ఉత్పత్తి చేస్తోందన్నారు. తెలంగాణ మంత్రులు మాట్లాడుతున్న తీరు బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమ నీటి తరలింపులను చూస్తూ ఉరుకోబోమని ఉదయభాను స్పష్టం చేశారు. అనంతరం జగ్గయ్యపేట మండలం ముక్త్యాల వద్ద కృష్ణా నది దాటి పులిచింతల వెళ్లారు. పడవ ద్వారా అచ్చంపేట మండలం మాదిపాడు చేరుకున్న ఉదయభాను పులిచింతల ప్రాజెక్టు వద్దకు వెళ్లారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.

Last Updated : Jul 11, 2021, 4:47 PM IST

ABOUT THE AUTHOR

...view details