ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Telangana Minister KTR: దూరం తగ్గించడానికే లింకు రోడ్ల నిర్మాణం - hyderabad roads

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యలు తగ్గించడం కోసం ఐదు లింక్​రోడ్లను ఇవాళ అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు అక్కడి మంత్రి కేటీఆర్ తెలిపారు. వివిధ ప్రణాళికలతో వ్యూహాత్మకంగా.. భాగ్యనగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు.

Telangana Minister KTR
తెలంగాణ పురపాలక శాఖ మంత్రి

By

Published : Jun 28, 2021, 1:56 PM IST

హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ సమస్యలు, ప్రయాణం దూరం తగ్గించడమే లక్ష్యంగా ప్రణాళికబద్దంగా ముందుకెళ్తున్నామని పురపాలక మంత్రి కేటీఆర్‌ తెలిపారు. జీహెచ్​ఎంసీ పరిధిలో ఐదు లింక్‌రోడ్లను ఇవాళ అందుబాటులో తెస్తున్నామన్నారు. కొత్త రోడ్ల నిర్మాణం, ఉన్నరోడ్ల పరిరక్షణ, లింకు రోడ్లకు వేర్వేరుగా ప్రణాళికలతో... నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నామని కేటీఆర్‌ తెలిపారు.

ఎస్‌ఆర్‌డీపీలో భాగంగా వంతనెలు, అండర్‌పాస్‌లు నిర్మిస్తున్నాం. సీఆర్ఎంపీ కింద రూ.1800 కోట్లతో కార్యక్రమాలు చేపడుతున్నాం. మొదటి దశలో రూ.313.65 కోట్లతో లింకు రోడ్లు నిర్మిస్తున్నాం. ఇప్పటికే 16 రోడ్లను పూర్తి చేశాం. త్వరలోనే మరో 6 రోడ్లను పూర్తి చేస్తాం. రెండో దశలో అదనంగా మరో 13 రోడ్లను ఏర్పాటు చేస్తాం. మరింత పారదర్శకంగా రోడ్ల నిర్మాణం చేపడతాం. జీహెచ్‌ఎంసీ వెబ్‌సైట్‌లో రోడ్ల నిర్మాణ వివరాలు అందుబాటులో ఉంచుతాం. ప్రణాళికబద్ధంగా దశలవారీగా లింకు రోడ్లను నిర్మిస్తున్నాం. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు ఉంటే నగర జీవనం బాగుంటుంది.

- కేటీఆర్, తెలంగాణ పురపాలక శాఖ మంత్రి

హైదరాబాద్‌ ట్రాఫిక్‌ సమస్యలు, ప్రయాణదూరం తగ్గించేలా..ప్రభుత్వం లింకురోడ్లు నిర్మిస్తోంది. మొత్తం 126కిలోమీటర్ల మేర 135 లింక్‌రోడ్లకు ప్రణాళికలు వేయగా.... 5 లింకురోడ్లను మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తున్నారు. 27కోట్ల 43 లక్షలతో ఈ రోడ్ల నిర్మాణ పనులు పూర్తిచేశారు. వసంత్ సిటీ నుంచి న్యాక్ వరకు ముప్పావు కిలోమీటరు.. ఐడీపీఎస్ ఎంప్లాయిస్ కాలనీ నుంచి శ్రీల పార్కు రోడ్ వరకు అర కిలోమీటరు లింక్ రోడ్ నిర్మాణం చేపట్టారు. నోవాటెల్ నుంచి.. ఆర్టీఏ ఆఫీస్ వరకు 0.6 కిలోమీటర్లు, జీవీ హిల్స్ పార్కు నుంచి మద్జీబ్ బండ వరకు కిలోమీటరు, ఐఎస్బీ రోడ్డు నుంచి ఓఆర్​ఆర్ వరకు 2కిలోమీటర్ల లింక్ రోడ్లు ఇవాళ కేటీఆర్‌ అందుబాటులోకి తీసుకువస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details