కృష్ణా జిల్లా మైలవరం మండలం తిరువూరు వైపు నుంచి అక్రమంగా విజయవాడ తరలిస్తున్న తెలంగాణ మద్యాన్ని... మైలవరం ఎక్సైజ్ స్టేషన్ బ్యూరో పెద్ది రాజు ఆధ్వర్యంలో పట్టుకున్నారు. ఈ తనిఖీలలో 337 క్వార్టర్ బాటిళ్లు పట్టుకున్నారు. ఒక ద్విచక్ర వాహనం, కారుతో పాటు ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
వేరువేరు చోట్ల తెలంగాణ మద్యం సీజ్... ఆరుగురు అరెస్ట్ - కృష్ణా జిల్లాలో అక్రమ మద్యం వార్తలు
తెలుగు రాష్ట్రాల్లో మద్యం ధరల్లో వ్యత్యాసం ఉన్నందున తెలంగాణ మద్యాన్ని అక్రమంగా రాష్ట్రానికి తరలిస్తున్నారు. కృష్ణా జిల్లాలో వివిధ చోట్ల... పోలీసుల జరిపిన తనిఖీల్లో.. తెలంగాణ మద్యాన్ని సీజ్ చేశారు. ఆరుగుర్ని అదుపులోకి తీసుకున్నారు.
![వేరువేరు చోట్ల తెలంగాణ మద్యం సీజ్... ఆరుగురు అరెస్ట్ Telangana liquor siegzed by krishna district police](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7454018-496-7454018-1591158017085.jpg)
Telangana liquor siegzed by krishna district police
కృష్ణా జిల్లా చాట్రాయి మండలం సి.గుడిపాడు గ్రామంలో డొంక రహదారిలో 480 తెలంగాణ మద్యం సీసాలు ఎస్‌ఐ కె. శివన్నారయణ ఆధ్వర్యంలో పట్టుకున్నారు. ముగ్గురు వ్యక్తులని అదుపులో తీసుకున్నారు.
ఇదీ చదవండి:14 ఏళ్ల బాలుడిని బలిగొన్న సెల్ఫోన్