తెలంగాణ రాష్ట్రం నుంచి భారీగా కారులో తరలిస్తున్న మద్యం బాటిళ్లను కృష్ణాజిల్లా విస్సన్నపేట ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. 720 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని కారుని సీజ్ చేశారు. ఒకరిపై కేసు నమోదు చేసినట్లు విస్సన్నపేట ఎక్సైజ్ స్టేషన్ సీఐ శ్రీనివాస్ బాలాజీ తెలిపారు. ఖమ్మం, కృష్ణా జిల్లా సరిహద్దు అయిన చాట్రాయి, చనుబండ అంతరాష్ట్ర చెక్ పోస్టుల్లో పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేశారు. ఎట్టిపరిస్థితుల్లో తెలంగాణ మద్యం రాష్ట్రంలోకి ప్రవేశించకుండా తనిఖీలు చేస్తున్నట్లు సీఐ శ్రీనివాస్ బాలాజీ తెలిపారు.
తెలంగాణ నుంచి తరలిస్తున్న మద్యం సీజ్ - liquor seized news in krishna dst
కృష్ణాజిల్లా విస్సన్నపేటలో తెలంగాణ రాష్ట్రం నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కారుని సీజ్ చేసి ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు సీఐ శ్రీనివాస్ బాలాజీ వెల్లడించారు.
telangana liquor seized in kirhna dst visannapeta