కృష్ణాజిల్లా నూజివీడు బాపునగర్లో తెలంగాణ మద్యం అమ్ముతున్నట్లు సమాచారంతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో సుమారు 26 వేల రూపాయల విలువైన మద్యం పట్టుబడినట్లు నూజివీడు డీఎస్పీ బి. శ్రీనివాసులు వెల్లడించారు. ఈ తనిఖీల్లో మొత్తం 387 మద్యం సీసాలు స్వాధీనం చేసుకోగా.. అక్రమంగా మద్యం విక్రయిస్తున్న కొలికిపోగు రాజును అరెస్ట్ చేశారు. ఎవరైనా తెలంగాణ రాష్ట్ర నుంచి మద్యం అక్రమ రవాణా చేసినా, అమ్మినా కఠిన చర్యలు తీసుకుంటామని నూజివీడు డీఎస్పీ బి. శ్రీనివాసులు హెచ్చరించారు.
నూజివీడులో తెలంగాణ మద్యం పట్టివేత - liquor seized at nuzvid
కృష్ణా జిల్లా నూజివీడులో సుమారు రూ. 26 వేల విలువైన తెలంగాణ మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మద్యం అక్రమ రవాణా చేసినా, అమ్మినా కఠిన చర్యలు తీసుకుంటామని నూజివీడు డీఎస్పీ శ్రీనివాసులు హెచ్చరించారు.
నూజివీడులో తెలంగాణ మద్యం పట్టివేత