తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా పరీక్షల విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. మహమ్మారికి సంబంధించి వేసిన వ్యాజ్యాలపై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం.. రోజుకు 50వేల కొవిడ్ పరీక్షలు చేయాలన్న ఆదేశాలను ఉద్దేశపూర్వకంగానే అమలు చేయడం లేదని ఘాటుగా వ్యాఖ్యానించింది. దీనిపై ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావుకు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. ధిక్కరణ చర్యలు ఎందుకు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అవసరమైనప్పుడు మాత్రమే ప్రభుత్వం 50వేల పరీక్షలు నిర్వహిస్తామని నివేదికలో పేర్కొనడాన్ని తప్పుపట్టింది.
ఫిర్యాదులు అందుతున్నా చర్యలు తీసుకోరా?