కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(KRMB)కు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. ప్రభుత్వం తరఫున ఈఎన్‌సీ మురళీధర్ కేఆర్ఎంబీ ఛైర్మన్‌కు లేఖ రాశారు. కేఆర్‌ఎంబీకి ఏపీ ప్రభుత్వం రాసిన లేఖపై వివరణ ఇచ్చారు. ఏపీ నిరాధారమైన వాదనను పట్టించుకోవద్దని కోరారు. తెలంగాణలో గోదావరి నీటిని కృష్ణా బేసిన్‌కు తరలించే చోట టెలీమెట్రీలు ఏర్పాటు చేయాలని ఏపీ గతంలో కోరింది. గోదావరి నుంచి తరలించే జలాలను రెండు రాష్ట్రాలకు పంచాలని విజ్ఞప్తి చేసింది.
TS Govt letter to KRMB: కృష్ణా బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ - ts govt letter to KRMB
18:44 September 21
ts govt letter to KRMB
దీనిపై వివరణ ఇచ్చిన ఈఎన్‌సీ కృష్ణానీరు ఇవ్వని ప్రాంతాలకే గోదావరి నీళ్లిస్తున్నామన్నారు. గోదావరి జలాల మళ్లింపుతో కృష్ణాలో నీరు మిగులుతోందని చెప్పారు. మిగులు నీటిని ఎగువ ప్రాజెక్టుల్లో వినియోగించుకోవచ్చని తెలిపారు. తక్కువ నీటి మళ్లింపునకు టెలిమెట్రీలు అవసరం లేదని లేఖలో పేర్కొన్నారు. కృష్ణా, గోదావరి ట్రైబ్యునళ్ల ప్రకారం అదనపు వాటా కిందికి కూడా రాదని చెప్పారు. కృష్ణానీరు అందని ప్రాంతాలకే గోదావరి జలాలు మళ్లిస్తున్నామని లేఖలో స్పష్టం చేశారు.
ఇదీ చదవండి
TIRUMALA: అక్టోబరు 7 నుంచి 15 వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు: తితిదే