Telangana letter to KRMB: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతుల్లేకుండా చేపడుతున్న గాలేరు - నగరి హంద్రీనీవా ప్రాజెక్టుల విస్తరణ, కొత్త పనులను నిలువరించాలని తెలంగాణ ప్రభుత్వం కృష్ణా బోర్డును కోరింది. ఈ మేరకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఛైర్మన్‌కు తెలంగాణ నీటి పారుదల శాఖ ఈఎన్‌సీ మురళీధర్ లేఖ రాశారు. ఎలాంటి అనుమతుల్లేకుండా హంద్రీనీవా సుజల స్రవంతి రెండో దశలో భాగంగా పుంగనూరు బ్రాంచ్ కెనాల్ విస్తరణ పనులకు ఏపీ టెండర్ నోటిఫికేషన్ ఇచ్చిందని అందులో పేర్కొన్నారు.
అనుమతులు లేని ఆ ప్రాజెక్టులను నిలువరించాలి: కేఆర్‌ఎంబీకీ తెలంగాణ లేఖ - గరి హంద్రీనీవా ప్రాజెక్టుల విస్తరణ
Telangana letter to KRMB: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టుల విస్తరణ, నూతన పనులను నిలిపివేయాలని తెలంగాణ ప్రభుత్వం కృష్ణా బోర్డును కోరింది. ఎలాంటి అనుమతులు లేకుండా ఈ పనులు చెేపట్టారని బోర్డుకు తెలిపింది.
హంద్రీనీవా, గాలేరు-నగరి సుజల స్రవంతి ప్రాజెక్టుల విస్తరణ పనులకు ఏపీ ప్రభుత్వం టెండర్లు పిలిచినట్లు లేఖలో తెలిపారు. ఈ పనులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విభజన చట్టానికి విరుద్ధంగా చేపట్టిందని తెలంగాణ తెలిపింది. అత్యున్నత మండలి, కృష్ణా బోర్డు అనుమతి లేకుండా బేసిన్ వెలుపలకు నీటిని తరలించే విస్తరణ పనులను ఏపీ చేపట్టకుండా నిలువరించాలని కృష్ణా బోర్డును తెలంగాణ కోరింది. ఉల్లంఘనలకు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేసింది.
ఇవీ చదవండి: