ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తెలంగాణలో ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు రద్దు

ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు రద్దు చేస్తున్నట్లు తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులంతా ఉత్తీర్ణులేనని తెలిపారు. అనుత్తీర్ణులను సప్లిమెంటరీలో పాస్‌ అయినట్లు పరిగణిస్తామని తెలిపారు.

By

Published : Jul 9, 2020, 7:34 PM IST

inter advance supplementary exams cancelled in telangana
తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు రద్దు చేస్తున్నట్లు తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులంతా ఉత్తీర్ణులేనని తెలిపారు. అనుత్తీర్ణులను సప్లిమెంటరీలో పాస్‌ అయినట్లు పరిగణిస్తామని చెప్పారు.

10 రోజుల్లో రీకౌంటింగ్‌, రీవాల్యుయేషన్‌ ఫలితాలు

ప్రభుత్వ నిర్ణయంతో 1.47 లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందుతారని తెలిపారు. జులై 31 తర్వాత కళాశాలల్లో మెమోలు పొందవచ్చని వెల్లడించారు. రీకౌంటింగ్‌, రీవాల్యుయేషన్‌ ఫలితాలను 10 రోజుల్లో ప్రకటిస్తామని చెప్పారు. విద్యార్థుల ఆరోగ్యం కోసమే సీఎం కేసీఆర్ పరీక్షలను రద్దు చేశారని పేర్కొన్నారు.

ఇదీ చదవండి :రాష్ట్రంలో ఐఏఎస్ అధికారుల బదిలీ

ABOUT THE AUTHOR

...view details