రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్తో తెలంగాణ మాజీ ఎన్నికల కమిషనర్, ఎన్నికల సంఘం సలహాదారు నాగిరెడ్డి భేటీ అయ్యారు. విజయవాడలోని ఎస్ఈసీ కార్యాలయంలో వివిధ అంశాలపై చర్చించారు. నాలుగో విడత పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణ అంశంపై వారిరువురూ సమీక్ష నిర్వహించారు.
ఎన్నికల్లో నామినేషన్ల గందరగోళం, బలవంతపు నామినేషన్ల ఉపసంహరణ, వివిధ అంశాలపై కోర్టు ఆదేశాలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియ కొనసాగిస్తూ నోటిఫికేషన్ జారీ చేసే అంశాలు భేటీలో ప్రస్తావన వచ్చినట్టు సమాచారం.