CEO VIKAS RAJ : తెలంగాణలో మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ సజావుగా జరిగేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ తెలిపారు. ఉదయం ఆరు గంటలకు మాక్ పోలింగ్ నిర్వహిస్తారని, ఏజెంట్లు ఐదున్నరకల్లా చేరుకోవాలని ఆయన సూచించారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ వెబ్ కాస్టింగ్ ఉంటుందని.. సీఈఓ కార్యాలయంతో పాటు ఈసీ నుంచి పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు. నియోజకవర్గంలో అంతటా తనిఖీలు కొనసాగుతున్నాయని.. ఇప్పటివరకు ఎనిమిది కోట్ల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ప్రచారం ఒక్క చోట మినహా అంతటా సాఫీగా జరిగిందని.. నిన్నటి ఘటనపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఉపఎన్నిక ఏర్పాట్లపై వికాస్‌రాజ్‌తో మా ప్రతినిధి రఘువర్ధన్ ముఖాముఖి.
మునుగోడు ఓటర్లకు సీఈఓ వికాస్‌రాజ్ విజ్ఞప్తి.. అలా మాత్రం ఓటు వేయొద్దని..! - రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్
CEO VIKAS RAJ : మునుగోడు ఉపఎన్నిక పోలింగ్‌కు పకడ్బందీగా ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్ తెలిపారు. వందశాతం పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ చేస్తున్నట్లు చెప్పారు.
CEO VIKAS RAJ