తెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతి పట్ల సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ సభలో సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. ప్రణబ్ మృతితో ఈ దేశం శిఖర సమానమైన నేతను కోల్పోయిందని కేసీఆర్ అన్నారు.
రాజకీయ సంద్రాన్ని సమర్థంగా ఈదిన నేత... ప్రణబ్: కేసీఆర్ - తెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రారంభం
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ తెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. వైరస్ వ్యాప్తి ఉన్నందున అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. కరోనా వైరస్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి వివరించారు. అనంతరం మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ మృతిపట్ల సభ తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది.
తెలంగాణ శాసనసభ సమావేశాలు
బంగాల్‌లోని చిన్న గ్రామం నుంచి రాష్ట్రపతి వరకు ఎదిగారని కొనియాడారు. రాజకీయ సముద్రాన్ని సమర్థంగా ఈదిన నేత.. ప్రణబ్ అని గుర్తు చేశారు. జటిల సమస్యలను పరిష్కరించే నేతగా ప్రణబ్ పేరు తెచ్చుకున్నారని పేర్కొన్నారు. ప్రపంచంలోనే ప్రముఖ ఆర్థికవేత్తగా ప్రణబ్ పేరు తెచ్చుకున్నారని కేసీఆర్ గుర్తు చేశారు.
ఇదీ చూడండి.పనుల కనికట్టు..అవినీతి గుట్టురట్టు