విజయవాడ విద్యాధరపురం సితార సెంటర్‌లో భవానీపురం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఓ ద్విచక్ర వాహనదారుడు జర్కిన్ లోపల మద్యం సీసాలు పెట్టుకుని తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. తెలంగాణ నుంచి అక్రమంగా మద్యం రవాణా చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 11 బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేయడంతో పాటు వారిపై కేసు నమోదు చేయనున్నట్లు భవానీపురం సీఐ మోహన్‌రెడ్డి తెలిపారు.
విజయవాడలో తెలంగాణ మద్యం పట్టివేత - alcohol abused in vijayawada
తెలంగాణ నుంచి రాష్ట్రంలోకి అక్రమ మద్యం రవాణా కొనసాగుతూనే ఉంది. తాజాగా విద్యాధరపురం సితార సెంటర్ లో భవానీపురం పోలీసులు అక్రమ మద్యం స్వాధీనం చేసుకున్నారు.
![విజయవాడలో తెలంగాణ మద్యం పట్టివేత Telangana alcohol abuse in Vijayawada krishna district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7813390-716-7813390-1593410256399.jpg)
విజయవాడలో తెలంగాణ మద్యం పట్టివేత