ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'తెలంగాణలో వ్యాపారులు, ప్రభుత్వం కలిసిపోయి రైతులకు తీరని ద్రోహం చేస్తున్నారు' - tdp latest news

తెలంగాణలో నకిలీ విత్తనాల కారణంగా పెద్ద ఎత్తున ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెదేపా నేతలు ఆరోపించారు. ఉద్యమ కాలంలో రైతలు బంగారు పంటలు పండిస్తున్నారని చెప్పిన కేసీఆర్... ఏడేళ్లుగా రైతులకు తీవ్ర ఆన్యాయం చేస్తున్నారని నేతలు మండిపడ్డారు. తెలంగాణకి సంబంధించి 'వ్యవసాయ సంక్షోంభం -సమస్యల సుడిలో అన్నదాత' అనే అంశంపై మహానాడులో నెల్లూరు దుర్గా ప్రసాద్... తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.

mahanadu
మహానాడు

By

Published : May 27, 2021, 5:38 PM IST

నకిలీ విత్తనాల కారణంగా తెలంగాణ రాష్ట్రంలో రైతులు పెద్దఎత్తున ఆత్మహత్య చేసుకుంటున్నారని నేతలు విమర్శించారు. తెలంగాణకి సంబంధించి 'వ్యవసాయ సంక్షోభం -సమస్యల సుడిలో అన్నదాత' అనే అంశంపై మహానాడులో నెల్లూరు దుర్గా ప్రసాద్... తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. జ్యోజిరెడ్డి, కాపా కృష్ణమోహన్​లు ఈ తీర్మానాన్ని బలపరిచారు. రైతులు బంగారు పంటలు పండిస్తారని ఉద్యమకాలంలో చెప్పిన కేసీఆర్... ఏడేళ్లుగా రైతులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని నేతలు మండిపడ్డారు. గిట్టుబాట ధర లభించకపోగా... పాటు పండించిన పంటను కూడా ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదని విమర్శించారు. తెలంగాణలో వ్యాపారులు, ప్రభుత్వం కుమ్మక్కై రైతులకు తీరని ద్రోహం చేస్తున్నారని ఆరోపించారు. రైతుల పక్షాన తెదేపా తెలంగాణ శాఖ పోరాడుతుందని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details