తెలంగాణలో కొత్తగా 1,473 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 8 మంది మృతి చెందారు. ఆదివారం రాత్రి 8 గంటల వరకు మొత్తం బాధితుల సంఖ్య 55,532కు, మరణాలు 471కి చేరాయి. ఇప్పటి వరకు వైరస్ నుంచి కోలుకొని42,106 మంది డిశ్చార్జయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ఆసుపత్రుల్లో 12,955 మంది చికిత్స పొందుతున్నారు.
తెలంగాణలో కొత్తగా 1,473 కరోనా కేసులు.. 8 మంది మృతి - తెలంగాణలో కోవిడ్ కేసుల సంఖ్య
తెలంగాణలో కరోనా కేసుల రోజురోజుకు పెరుగుతునే ఉన్నాయి. కొత్తగా 1,473 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 8 మంది మృతి చెందారు.
తెలంగాణలో కరోనా కేసులు
రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం 9,817 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించినట్టు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు 3,63,242 మందికి పరీక్షలు చేసినట్టు స్పష్టం చేసింది. రాష్ట్రంలో మరణాలు రేటు 0.85, దేశంలో 2.3 ఉన్నట్టు వెల్లడించింది. ప్రతి 10 లక్షల జనాభాలో 245 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు జరుపుతున్నట్టు వివరించింది.
ఇవీ చదవండి