విజయవాడలోని చిట్టినగర్‌కు చెందిన యాసిన్ రిజ్వాన్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. నమ్మిన స్నేహితుడే మోసం చేసాడని మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. స్నేహితుడైన సుభానీకి 8లక్షల రూపాయు అప్పుగా ఇచ్చాడు రిజ్వాన్. తిరిగి చెల్లించాలని చాలాసార్లు అడిగాడు. తనకు డబ్బులిచ్చినట్లు ఏమైనా ఆధారం ఉందా అని సుభానీ ఎదురు ప్రశ్నించాడు. కావాలంటే కేసు పెట్టుకోమన్నాడు. చేసేది లేక... యాసిన్... గాంధీనగర్‌లోని సాయిరాం లాడ్జిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన శవం ఆధారంగా బాధ్యుడిపై చర్యలు తీసుకొని...న్యాయం చేయాలని తన సుసైడ్ లెటర్‌లో కోరాడు యాసిన్. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
అప్పిచ్చిన డబ్బులు తిరిగివ్వలేదని యువకుని ఆత్మహత్య - vijayawada
విజయవాడలో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. స్నేహితుని అవసరానికి డబ్బులిచ్చి తానే చిక్కులో పడ్డాడు. దీంతో మనస్థాపానికి గురైన యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
విజయవాడలో యువకుని ఆత్మహత్య