ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పి.గన్నవరంలో అమర జవాన్లకు కన్నీటి నివాళి - గన్నవరం నేటి వార్తలు

దేశ రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన అమర సైనికులకు తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరంలో నివాళులర్పించారు. భారత్, చైనా సరిహద్దులో జరిగిన ఘర్షణల్లో అసువులు బాసిన జవాన్ల సేవలను కొనియాడారు.

Tearful tributes to Amara Jawans in P. Gannavaram East godavari district
పి.గన్నవరంలో అమర జవాన్లకు కన్నీటి నివాళులు

By

Published : Jun 17, 2020, 5:47 PM IST

తూర్పు లద్దాఖ్​లోని గాల్వన్ లోయలో జరిగిన ఘర్షణలో అమరులైన భారత సైనికులకు.. తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరంలో ఘన నివాళులు అర్పించారు. అమర జవాన్ సంతోష్ చిత్రపటానికి విశ్రాంత సర్కిల్ ఇన్​స్పెక్టర్​ రామ సత్యనారాయణ పూలమాల వేసి నివాళులర్పించారు. తండ్రి ఆశయం కోసం సైనికుడై.. దేశం కోసం ప్రాణాలర్పించిన సంతోష్ గొప్ప దేశభక్తుడని కొనియాడారు.

ABOUT THE AUTHOR

...view details