ఏలూరులో వింత వ్యాధికి సంబంధించి వైద్య నిపుణుల బృందాలు నమూనాలు సేకరిస్తున్నాయి. ప్రభావిత ప్రాంతాల్లో ఇంటింటికీ వెళ్లి వివిధ రకాల నమూనాలను సేకరిస్తున్నారు. మూర్ఛరోగం సోకిన ప్రాంతంలోని రోగుల ఇళ్లకు వెళ్లి.. వారు తీసుకున్న ఆహార పదార్థాల నమూనాలను తీసుకుంటున్నారు. వాటిని విశ్లేషించి సమస్యకు గల కారణాలు తేలుస్తామని వైద్య బృందం తెలిపింది.
ఏలూరులో నమూనాలు సేకరిస్తున్న వైద్య నిపుణుల బృందాలు - West Godavari District Eluru Latest News
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని ప్రజలు వింత జబ్బుతో హడలిపోతున్నారు. రోగానికి గల కారణాలు తెలియటం లేదు. ఎక్కడ ప్రజలు అక్కడే మూర్చతో పడిపోతున్నారు. ఆసుపత్రులన్నీ రోగులతో నిండిపోయాయి. బాధితుల ఇంట్లో నమూనాలు సేకరించే పనిలో ఉన్నారు ఐసీఎంఆర్ బృందాలు.
ఏలూరులో నమూనాలు సేకరిస్తున్న వైద్య నిపుణుల బృందాలు