విజయవాడ ఏ ప్లస్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన గురుపూజోత్సవాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వేపల్లి రాధాకృష్ణ జీవితం తరతరాలకు బాటలు చూపే పాఠం అని అన్నారు. గురువులను అత్యంత గౌరవించిన వారిలో వైఎస్ఆర్ ఒకరని వ్యాఖ్యానించారు. పాఠాలు చెప్పిన గురువు వెంకటప్పయ్య పేరుతో పాఠశాల స్థాపించారని ఆయన గుర్తుచేసుకున్నారు. గురువు చేసే పనిని ఎవరూ చేయలేరని ఆయన అన్నారు. అందువల్లే గురువును దేవుడుతో పోలుస్తారని సీఎం వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో నిరక్ష్యరాస్యత శాతం జాతీయ స్థాయితో పోలిస్తే ఎక్కువుగా ఉందనీ, దాన్ని 0 శాతం చేయాలన్నదే ఆయన లక్ష్యం అని సీఎం తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సురేష్, పేర్ని నాని, కొడాలి నాని, కన్నబాబు, మహిళా కమిషన్ ఛైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ పాల్గొన్నారు.
"నిరక్ష్యరాస్యత సున్నాకు తీసుకురావడమే లక్ష్యం" - సీఎం జగన్
విజయవాడలోని ఓ ప్రైవేటు హోటల్‌లో జరిగిన గురుపూజోత్సవంలో సీఎం జగన్ పాల్గొన్నారు. ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు అందజేశారు.
గురుపూజోత్సవ కార్యాక్రమంలో సీఎం జగన్