కృష్ణా జిల్లా మచిలీపట్నం రెవెన్యూ అసోసియేషన్ హాల్ వేదికగా.. గురుపూజోత్సవాన్ని నిర్వహించారు. రవాణ శాఖ మంత్రి పేర్ని వెంకట రామయ్య హాజరయ్యారు. జిల్లాలో ఎంపికైన 132 మంది ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం కన్నా సమాజంలో ఉపాధ్యాయులే సేవాభావంతో వ్యవహరిస్తారని మంత్రి తెలిపారు. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలూ చేపడుతుందన్నారు. విద్యాభివృద్ధికోసం ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ హాజరయ్యారు. కలెక్టర్ ఇంతియాజ్, ఎమ్మెల్సీలు ఏఎస్ రామకృష్ణ, కె లక్ష్మణరావు పాల్గొన్నారు.
మచిలీపట్నంలో ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం - teachers day
గురుపూజోత్సవాల్లో భాగంగా మచిలీపట్నం రెవెన్యూ అసోసియేషన్ హాల్ వేదికగా.. జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులను రవాణ శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య సత్కరించారు.
'మచిలీపట్నంలో ఉత్తమ ఉపాధ్యాయులను సత్కరించిన మంత్రి'