కృష్ణా జిల్లా నూజివీడు మండలం ఆగిరిపల్లిలోని స్థానిక ప్రైవేటు పాఠశాలలో.. విద్యార్థిపై ఉపాధ్యాయుడు చేయిచేసుకున్న ఘటన జరిగింది. ఐదో తరగతి చదువుతున్న గోళ్ళ అభిరామ్ జ్వరం కారణంగా హోంవర్క్ చేయలేదని చెప్పగా.. టీచర్ సామ్యూల్ రాజు పిల్లాడిని విచక్షణారహితంగా దండించాడు. దీంతో అభిరామ్ ఎడమ చేయి గూడు జారిపోయింది. సమాచారం తెలుసుకున్న విద్యార్థి తండ్రి పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి ఫిర్యాదు చేశాడు. అభిరామ్‌కు తొలుత గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స చేయించి.. మెరుగైన వైద్యం కోసం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విద్యార్థి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
హోంవర్క్ చేయలేదని విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు - teacher beats student harshly in krishna district
కృష్ణా జిల్లా ఆగిరిపల్లి గ్రామంలోని స్థానిక పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న విద్యార్థిని... హోంవర్కు చేయలేదని ఉపాధ్యాయుడు చితకబాదాడు. దీంతో చిన్నారి ఎడమ చేయి గూడు జారిపోయింది.
హోంవర్కు చేయలేదని చితకబాదిన టీచర్