ఉల్లి, కూరగాయల ధరలు తగ్గించాలని కోరుతూ విజయవాడ అజిత్ సింగ్ నగర్ సెంట్రల్ తెదేపా కార్యాలయం ఆవరణలో తెలుగు మహిళ నాయకులు నిరసన చేపట్టారు. కూరగాయలు, ఉల్లి దండలు వేసుకొని ఆందోళన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగు మహిళా నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఓ పక్క ప్రభుత్వ పథకాలు ఇస్తూనే మరో పక్క నిత్యావసర వస్తువుల ధరలు, కూరగాయల ధరలు ట్యాక్సులు పెంచి సామాన్యూడి నడ్డి విరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉల్లి, కూరగాయల ధరలు తగ్గించాలని తెదేపా మహిళ నేతల ధర్నా - విజయవాడలో తెదేపా మహిళ నేతల ఆందోళన
ఉల్లి ధరలు తగ్గించాలని కోరుతూ కృష్ణా జిల్లా విజయవాడ అజిత్సింగ్ నగర్లో తెదేపా మహిళా నాయకులు ధర్నా చేశారు. ఉల్లి, కూరగాయల దండలు వేసుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
![ఉల్లి, కూరగాయల ధరలు తగ్గించాలని తెదేపా మహిళ నేతల ధర్నా tdp women protest at vijayawada](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9295790-900-9295790-1603534491610.jpg)
తెదేపా మహిళ నేతల ధర్నా