ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'దిశ'కు చట్టబద్ధతే లేదు: తెదేపా మహిళ నేతలు - తెదేపా మహిళా విభాగం అధ్యక్షురాలు వంగలపూడి అనిత వార్తలు

ముఖ్యమంత్రి జగన్​పై తెదేపా మహిళా నేతలు విమర్శనాస్త్రాలు సంధించారు. చట్టానికే చట్టబద్దత లేని చట్టమే దిశ చట్టమని వారు విమర్శించారు. చంద్రబాబు ప్రారంభించిన గిరిజన మహిళల వసతి గృహాలను వైకాపా ప్రభుత్వం తిరిగి ప్రారంభించాలని డిమాండ్ చేశారు.

tdp women leaders comments on cm jagan
తెదేపా మహిళ నేతలు

By

Published : Jun 30, 2021, 10:41 AM IST

'ధరలు పెంచి సామాన్యులను ఇబ్బందులకు గురిచేస్తున్న వ్యక్తే జగన్ రెడ్డి' అని తెదేపా మహిళా విభాగం అధ్యక్షురాలు వంగలపూడి అనిత దుయ్యబట్టారు. చట్టానికే చట్టబద్దత లేని చట్టమే దిశ చట్టమని ఆమె విమర్శించారు. దిశ యాక్ట్ ద్వారా మహిళలకు చేసింది ఏమి లేదన్నారు.

జగన్ ముఖ్యమంత్రి అని జగన్​తో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, వైకాపా నాయకులు అందరూ మరిచిపోయారని.. తెదేపా పొలిట్ బ్యూరో సభ్యురాలు గుమ్మడి సంధ్యారాణి ధ్వజమెత్తారు. కుటుంబంలో అందరం కరోనా బారిన పడినప్పుడు తెదేపా అధినేత చంద్రబాబు నాయుడి ఒక్క ఫోన్ కాల్ తన కుటుంబాన్ని బతికించిందని ఆమె తెలిపారు. చంద్రబాబు ప్రారంభించిన గిరిజన మహిళల వసతి గృహాలను వైకాపా ప్రభుత్వం తిరిగి ప్రారంభించాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details