ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'మహిళా కమిషన్​కు యాక్షన్​ తక్కువ... ఓవరాక్షన్​ ఎక్కువ' - ఏపీలో మహిళలపై దాడులు

రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు జరుగుతుంటే.. మహిళా కమిషన్ ఏం చేస్తుందని తెదేపా మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ప్రశ్నించారు. కమిషన్ మహిళల హక్కుల కోసం పనిచేస్తోందా లేక వైకాపా కార్యకర్తలను కాపాడేందుకు పనిచేస్తోందా అని ధ్వజమెత్తారు.

tdp women leader
tdp women leader

By

Published : Jul 1, 2020, 12:51 PM IST

రాష్ట్రంలో గంటకో మహిళపై అఘాయిత్యాలు జరగుతుంటే మహిళా కమిషన్ ఏం చేస్తుందని..తెదేపా మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ప్రశ్నించారు. మహిళలపై జరుగుతున్న దాడులను మహిళా కమిషన్ ఒక్క రోజైనా స్పందించిందా అంటూ విమర్శించారు. గుంటూరు జిల్లాలో బీటెక్ విద్యార్ధిని కేసులో సాక్ష్యాలు తారుమారు చేస్తుంటే... ఏం చేస్తున్నారని ఆమె నిలదీశారు. బాధితులను బెదరించిన రౌడీషీటర్ ను ఇప్పటిదాకా ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు.

" మహిళా కమిషన్ కు యాక్షన్ తక్కువ.. ఓవరాక్షన్ ఎక్కువ. కుంభకుర్ణ నిద్రలో మిహళా కమిషన్ ఉంది. వైకాపా మిషన్​గా మారి ఈ వ్యవస్థ పనిచేస్తోంది. గుంటూరు జిల్లాలో బీటెక్ విద్యార్ధిని కేసులో సాక్ష్యాలు తారుమారు చేస్తుంటే... ఏం చేస్తున్నారు. బాధితులను బెదరించిన రౌడీషీటర్ ను ఇప్పటిదాకా ఎందుకు అరెస్ట్ చేయలేదు. కమిషన్ మహిళల హక్కుల కోసం పనిచేస్తోందా.. వైకాపా కార్యకర్తలను కాపాడేందుకు పనిచేస్తోందా..? "- తెదేపా మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత

ఇదీ చదవండి:డ్రాగన్‌తో ఢీ అంటే 'టీ'.. యుద్ధ ట్యాంకర్లు మోహరించిన భారత్

ABOUT THE AUTHOR

...view details