కృష్ణా జిల్లా గుడివాడ తెదేపా అభ్యర్థి దేవినేని అవినాష్ ఎన్నికల ప్రచారంలో వేగం పెంచారు. నందివాడ మండలంలోని పలు గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. తెదేపా సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. చంద్రబాబు ద్వారానే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని... ఆయణ్ణి మళ్లీ ముఖ్యమంత్రిని చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. సైకిల్ గుర్తుకు ఓటేసి తనను అఖండ మోజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
'గుడివాడలో తెదేపా జెండా ఎగరడం ఖాయం' - devineni
కృష్ణా జిల్లా గుడివాడలో తెదేపా విజయం ఖాయమని నియోజకవర్గ అభ్యర్థి దేవినేని అవినాష్ ఆశాభావం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఆయన కార్యకర్తలతో కలిసి విస్తృత ప్రచారం నిర్వహించారు.
దేవినేని అవినాష్ ఎన్నికల ప్రచారం