ఇసుక కొరత పట్ల ప్రభుత్వంపై చంద్రబాబు తీవ్ర విమర్శలు రాష్ట్రంలో జరుగుతున్న ఇసుక దందా ముఖ్యమంత్రి జగన్‌కు తెలియదా అని తెదేపా అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. కృష్ణా జిల్లాలో తెదేపా విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. నూతన విధానంతో తమ వారికే ఇసుక తవ్వకాల అనుమతులు ఇచ్చుకున్నారని ధ్వజమెత్తారు. వరదలతో ఇసుక కొరత ఏర్పడిందనటం అబద్ధమని విమర్శించారు. బ్లాక్ మార్కెట్‌పై ఉక్కుపాదం మోపితే ఇసుక పుష్కలంగా లభిస్తుందని చంద్రబాబు అన్నారు. బస్తా సిమెంట్ కంటే ఇసుక ధర ఎక్కువ ఉండటం జగన్నాటకమేనని ఆయన మండిపడ్డారు.
సీఎంకు ఓనమాలు రావు
ఇరిగేషన్‌లో ముఖ్యమంత్రికి ఓనమాలు రావని చంద్రబాబు విమర్శించారు. గతంలో తెదేపా చేపట్టిన నదుల అనుసంధానాన్ని విమర్శించిన జగన్ ఇప్పుడు ఆ దిశగానే చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. తమ పార్టీ దూరదృష్టికి అదే నిదర్శనమన్నారు. తెదేపా హయాంలో హాయిగా బతికిన ప్రజలు ఇప్పుడు కష్టాలు కొనితెచ్చుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెదేపాను దెబ్బతీసే శక్తి ఎవరికీ లేదని ధీమా వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి:
పారదర్శకంగా నియామకాలు.. మార్గదర్శకాలకు ఆదేశాలు