రాష్ట్రంలో హిందూ మతాన్ని కించపరిచే చర్యలు తగవని తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బుచ్చి రాంప్రసాద్ అన్నారు. హిందూ ఆచారాలపై కుట్రపూరితంగా దాడి జరుగుతోందని ఆరోపించారు. తిరుమల కొండపై నిబంధనలకు విరుద్ధంగా మంత్రులు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారని మండిపడ్డారు. వైకాపా నేతలు డ్రోన్లు ఎగురవేసి నియమాలు ఉల్లంఘించారని విమర్శించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, సరైన సమయంలో బుద్ది చెబుతారని బుచ్చి రాంప్రసాద్ హెచ్చరించారు.
'రాష్ట్రంలో హిందూ మతాన్ని కించపరిచే చర్యలు తగవు' - TDP State Executive Secretary
రాష్ట్రంలో హిందూ మతాన్ని కించపరిచేలా వైకాపా నేతలు వ్యవహరిస్తున్నారని తెదేపా నేత బుచ్చి రాంప్రసాద్ అన్నారు. తిరుమల కొండపై వైకాపా మంత్రులు క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పారని మండిపడ్డారు.
తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బుచ్చి రాంప్రసాద్