ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై కేసీఆర్ స్పందించాలి' - Telugudesam party news in Vijayawada

పీవీ నరసింహారావు, ఎన్టీఆర్ సమాధులను కూల్చేయాలని అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలను విజయవాడ తెదేపా అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ మండిపడ్డారు.

అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై కేసీఆర్ స్పందించాలి
అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై కేసీఆర్ స్పందించాలి

By

Published : Nov 26, 2020, 8:23 PM IST



ఎన్టీఆర్, పీవీ ఘాట్ కూల్చమని అక్బరుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలను ముస్లిం సమాజం అసహ్యించుకుంటోందని తెదేపా అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ మండిపడ్డారు. తెలుగుజాతికి అక్బరుద్దీన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. తమ లాలూచీ రాజకీయాలు, చీకటి పొత్తులు అందరికీ తెలిసినవేనని ధ్వజమెత్తారు. కేంద్ర, రాష్ట్ర అధికార పెద్దలకు తొత్తులుగా ఉంటూ అవినీతి సామ్రాజ్యాన్ని పెంచుకుంటున్నారని దుయ్యబట్టారు. అక్బరుద్దీన్ వ్యాఖ్యల పై కేసీఆర్ స్పందించాలని డిమాండ్ చేశారు.

ఇవీ చదవండి

ABOUT THE AUTHOR

...view details