ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తెదేపా అధికార ప్రతినిధి పట్టాభి కారు ధ్వంసం

తెదేపా అధికార ప్రతినిధి పట్టాభి కారును గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. ఇది వైకాపా పనే అని పట్టాభి ఆరోపించారు.

TDP spokesperson Pattabhi's car was destroyed at vijayawada
తెదేపా అధికార ప్రతినిధి పట్టాభి కారు ధ్వంసం

By

Published : Oct 4, 2020, 8:02 AM IST

Updated : Oct 4, 2020, 1:20 PM IST

తెదేపా అధికార ప్రతినిధి పట్టాభి కారు ధ్వంసం

తెలుగుదేశం అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి కారును గత రాత్రి దుండగులు ధ్వంసం చేశారు. విజయవాడ గురునానక్ కాలనీ సమీపంలోని తన నివాసం వద్ద పార్క్ చేసి ఉన్న కారు అద్దాలు పగలకొట్టారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతున్నందున వైకాపానే ఈ దుశ్చర్యకు పాల్పడిందని పట్టాభి ఆరోపించారు. వైకాపా అవినీతిని బయటపెడుతున్నందుకే తన కారుని ధ్వంసం చేశారని మండిపడ్డారు. తన నివాసం పక్కన హైకోర్టు జడ్జి నివాసం ఉందని... అక్కడ పోలీస్ పికెట్ ఉన్నా తన కారుని ధ్వంసం చేశారని ధ్వజమెత్తారు. ఎక్కడో సర్వే రాళ్లు తీసుకువచ్చి కారు పగలగొట్టారన్నారు. తన కారు ధ్వంసం చేస్తే భయపడే పిరికిపందను కాదని పట్టాభి తెలిపారు. పోలీసులు పట్టాభి నివాసానికి వచ్చి ధ్వంసమైన కారును పరిశీలించారు.

Last Updated : Oct 4, 2020, 1:20 PM IST

ABOUT THE AUTHOR

...view details