ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'జగనన్న క్రాంతి' కాదు 'జగనన్న భ్రాంతి' పథకం: పట్టాభిరామ్ - జగనన్న క్రాంతి పథకం తాజా వార్తలు

సీఎం జగన్ నేడు ప్రవేశపెట్టిన పథకం జగనన్న క్రాంతి కాదు జగనన్న భ్రాంతి పథకం అని తెదేపా అధికార ప్రతినిథి పట్టాభిరామ్ విమర్శించారు. కమీషన్ల కోసం పథకంలోని మాంసం ఉత్పత్తులను అల్లన ఫుడ్స్​కి కట్టబెట్టారని ఆరోపించారు. ముఖ్యమంత్రి ఇష్టానుసారం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. వెంటనే ఒప్పందాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

pattabhi ram
పట్టాభిరామ్, తెదేపా అధికార ప్రతినిథి

By

Published : Dec 10, 2020, 5:34 PM IST

క్విడ్​ప్రోకోలో భాగంగా రూ.500 కోట్ల కమీషన్ కోసం జగనన్న క్రాంతి పథకంలోని మాంసం ఉత్పత్తులను అల్లన ఫుడ్స్​కి కట్టబెడుతున్నారని.. తెదేపా అధికార ప్రతినిథి పట్టాభిరామ్ ఆరోపించారు. పన్నుల ఎగవేతలో రూ.2వేల కోట్ల అవకతవకలకు పాల్పడిన అల్లన ఫుడ్స్​కు ఎలాంటి టెండర్లు లేకుండా రూ.1,869 కోట్ల మాంసం ఉత్పత్తులను ఏకపక్షంగా ఎలా ధారాదత్తం చేస్తారని నిలదీశారు.

ముఖ్యమంత్రి ప్రవేశపెట్టింది జగనన్న భ్రాంతి పథకమన్న పట్టాభి.. ప్రజల్ని ఆ భ్రాంతిలో పెట్టి వందల కోట్లు దోచుకునేందుకు పథకం రచించారని దుయ్యబట్టారు. రూ.3 వేల కోట్లు ఎదురిచ్చి అమూల్ సంస్థను రాష్ట్రానికి తెచ్చి పాల ఉత్పత్తులన్నింటినీ కట్టబెట్టిన రీతిలోనే.. 38లక్షల గొర్రెలకు సంబంధించిన మాంసం ఉత్పత్తుల్ని ప్రజాధనం పెట్టుబడిగా పెట్టి ఏకపక్షంగా ఒకే సంస్థకు ఇస్తున్నారని విమర్శించారు. ఇష్టానుసారం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. వెంటనే ఒప్పందాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details