'ప్రజాచైతన్య యాత్రను చూసి వైకాపా నేతలు భయపడుతున్నారు' - తెదేపా అధికార ప్రతినిధి దివ్యవాణి తాజా ప్రెస్మీట్
వైకాపా పాలనలో రాష్ట్రం పతనమవుతోందని తెదేపా అధికార ప్రతినిధి దివ్యవాణి ఆరోపించారు. ప్రజా చైతన్య యాత్రను చూసి వైకాపా నేతలు భయపడుతున్నారని తెలిపారు. సొంత నియోజకవర్గంలోని ప్రజలే రోజాను విమర్శిస్తున్నారని చెప్పారు.

వైకాపా పాలనలో ఏపీ పతనమవుతోందని తెదేపా అధికార ప్రతినిధి దివ్యవాణి అన్నారు. సొంత నియోజకవర్గం ప్రజలే రోజాను విమర్శిస్తున్నారని చెప్పారు. అమరావతి ప్రజల మధ్యకు రాలేని దుస్థితిలో ముఖ్యమంత్రి, వైకాపా నేతలున్నారని ఆరోపించారు. రాజధాని ప్రజలను పోలీసులతో దారుణంగా కొట్టిస్తున్నారన్నారు. చంద్రబాబును విమర్శించే స్థాయి రోజాకు లేదన్నారు. ప్రజా చైతన్య యాత్రను చూసి వైకాపా నేతలు భయపడుతున్నారని తెలిపారు. రాజధానికి దొడ్డిదారిన వెళ్లాల్సిన దుస్థితి రోజాకి వచ్చిందన్నారు. రోజా భజన కార్యక్రమాలు ఆపి ప్రజా సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలన్నారు.