వైకాపా నాయకులపై తెదేపా సీనియర్ నేత యరపతినేని శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సీబీఐని జేబు సంస్థలా మాట్లాడుతున్న వైకాపా నేతలు... ముందు తమ నాయకుడు జగన్ జైలుకు వెళ్లకుండా చూసుకోవాలని హితవు పలికారు. తమపై అక్రమ కేసులు పెట్టేందుకు అన్ని కుట్రలూ పన్నుతున్నారన్న యరపతినేని... ఇలాంటి వ్యవహారాలకు భయపడేది లేదని తేల్చి చెప్పారు.
'దేనినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు పెట్టే ప్రతి అక్రమ కేసుకు వడ్డీతో సహా చెల్లిస్తాం. పల్నాడులో ఫ్యాక్షన్ రాజకీయాలను కాసు కుటుంబం పెంచి పోషించింది. తెలుగదుదేశం అభివృద్ధి ఏంటో చేసి చూపింది. గురజాలలో జరిగే ప్రతి అవినీత అక్రమాల్లో ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి పాత్ర ఉంది. వైకాపా నాయకులకు చంద్రబాబును విమర్శించే అర్హత లేదు' - యరపతినేని శ్రీనివాస్